📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు,జిల్లా ఎస్పీ...

పిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు,జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ ,

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) అంతర్జాతీయ ఆన్లైన్ గేమింగ్ ముఠా పట్టివేత 10 మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన కళ్యాణదుర్గం పోలీసులు రూ.19,70,500/-నగదు కారు,04 బైకులు, 03 ల్యాప్ ట్యాప్ లు,15 సిమ్ కార్డులు, 04 చెక్ బుక్కులు,13 ATM కార్డులు,01 ట్యాబ్,15 మొబైల్ ఫోన్స్,తదితరాలు స్వాధీనం.9 బ్యాంకుల్లో 49 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలలోని రూ.18.20 లక్షల ఫ్రీజ్ అన్నీ కలిపి మొత్తం రూ.60 లక్షల విలువ ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా ఈముఠాకు సభ్యులు.ఈ తంతు ద్వారా వచ్చిన సొమ్ములో కింగ్ పిన్ కు 60 శాతం,దేశీయంగా సహకరించిన సభ్యులకు 40 శాతం ఫోన్ పే లావాదేవీల కోసం ఇక్కడి నుంచే సిమ్ లు,బ్యాంకు పాస్ బుక్కులు… కార్గో జీన్స్ ప్యాంట్లు పార్శిళ్ల ద్వారా పిలిప్పీన్స్ కు ఎగుమతి జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు మంగళవారం అనంతపురంలో మీడియాకు ఈ ముఠా అరెస్టు, తదితర వివరాలు వెల్లడి నిందితుల వివరాలు :1) తలారి మధు, వయస్సు 33 సం,,లు సిద్దప్పవంక వీధి, కళ్యాణదుర్గం పట్టణం2) వేపరాళ్ళ మహమ్మద్ @ మౌల, వయస్సు 25 సం,,లు,కుమ్మర వీధి,ళ్యాణదుర్గం పట్టణం3) షేక్ బాబ్జాన్,వయస్సు 32 సం,,లు,ఎర్రనేల వీధి, కళ్యాణదుర్గం పట్టణం 4) షేక్ రోషన్ వలి,వయస్సు 31 సం,,లు,ఇందిరమ్మ కాలనీ, కళ్యాణదుర్గం పట్టణం 5) మాకోడికి శ్రీనివాసులు,వయస్సు 47 సం,,లు,ఎర్రనేల వీధి కళ్యాణదుర్గం పట్టణం 6) తిమ్మయ్య, వయస్సు 45 సం,,లు,జెల్లిపల్లి గ్రామం,కంబదూరు మండలం7) రాగవెంకట పవన్ కుమార్,వయస్సు 25 సం,,లు, శ్రీనివాసపురం గ్రామం,జంగారెడ్డి గూడెం మండలం ఏలూరు జిల్లా.8) సుంకరవైన కిరణ్,వయస్సు 32 సం,లు, పిల్లలమర్రి గ్రామం,సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం( ప్రస్తుత నివాసం వనస్థలిపురం,రంగారెడ్డి జిల్లా,తెలంగాణ రాష్ట్రం.9) రాపాక ప్రశాంత్ వయస్సు 33 సం,లు,కోటిలింగాల గ్రామం,వెలగటూరు మండలం,జగిత్యాల జిల్లా,తెలంగాణ రాష్ట్రం 10) గడ్డవలస మణికoఠ రాజ,వయస్సు 28 సంవత్సరాలు,అజిత్ సింగ్ నగర్,విజయవాడ పరారీలో ఉన్న వారు :11) సచిన్ ,కర్నాటక రాష్ట్రం 12) శివ,పిలిప్పీన్స్  స్వాధీనం చేసుకున్నవి నగదు Rs 19,70,500/-,ఒక XUV 700 కారు (AP40 AR6568),నాలుగు బైకులు,03 ల్యాప్ ట్యాప్ లు,01 ట్యాబ్,15 మొబైల్ ఫోన్స్,1 పవర్ బ్యాంక్,15 సిమ్ కార్డులు,13 ATM కార్డులు,04 చెక్ బుక్ లు,01 ఖాళీ AXIS బ్యాంకు పాస్ బుక్కు, 06 స్కానర్లు,01 DREAM PLAY 1 బ్లూటూత్,03 పెన్ డ్రైవులు,02 కార్డ్ రీడర్స్,100 DREAM PLAY 1 పబ్లిసిటి కార్డ్స్ ,03 కార్గో జీన్స్ ప్యాంట్లు.9 బ్యాంకుల్లో రూ.18.20 లక్షల ఫ్రీజ్ ( అన్నీ కలిపి మొత్తం రూ 60 లక్షల విలువ ఉంటుంది ప్రస్తుతం అరెస్టయిన ఈ 10 మంది సభ్యులు కూడా పిలిప్పీన్స్ కేంద్రంగా అంతర్జాతీయ నిషేధిత ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న శివ ముఠాకు చెందిన వారు.ఇతను పరారీలో ఉన్నాడు.సదరు శివ,తన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు భారతదేశ వ్యాప్తంగా ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకొన్నాడు.వారి ద్వారా MULE అక్కౌంట్లు.వారి పాస్ బుక్కులు మరియు SIM కార్డులను సేకరించి ఢిల్లీ కేంద్రంగా పని చేయు తన ముఠాలోని సభ్యుల ద్వారా సదరు SIM కార్డులను పిలిప్పీన్స్ దేశానికి కార్గో జీన్స్ పాంట్ల ద్వారా తెప్పించుకుంటాడు.పిలిప్పీన్స్ లోని మాకాటి మెట్రో మనిలా అను ప్రదేశాన్ని కేంద్రంగా చేసుకొని నిషేధిత  యాప్ ద్వారా మూడు సంవత్సరాల నుండి ఆన్లైన్ లోక్యాషినో,రోలెంట్,డ్రాగన్,మోనోపోలో,క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర నిషేధిత గేములను ఆడిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు అన్నీ దాదాపుగా ఫోన్ పే ద్వారా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగానే ఇన్స్టాగ్రాం ద్వారా శివకు.తలారి మధుకు మూడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు సహకరిస్తే తనకు వచ్చే అమౌంటులో 60 శాతం తను తీసుకుని మిగితా 40 శాతం ఏజంట్లుగా ఉంటే మీ ఖాతాల్లో వేస్తానని శివ చెప్పడంతో మధు అంగీకరించాడు. దీంతో తలారి మధు స్థానికంగా ఉన్న వేపరాళ్ల మహమ్మద్షే,క్ బాబ్జాన్,షేక్ రోషన్ వలీ మాకొడికి శ్రీనివాసులు,తిమ్మయ్యలను సిద్ధం చేసుకున్నాడు.పవన్ కుమార్,కిరణ్,ప్రశాంత్ మణికంఠరాజలను జత చేసుకుని వీరంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరందరు కూడా సులువుగా డబ్బు సంపాదించాలని భావించి నిషేధిత ఆన్లైన్ యాప్ ద్వారా గేమింగ్ కు పాల్పడుతున్నారు ఇందులో పిలిప్పీన్స్ లో ఉంటున్న శివతో తలారి మధు క్రియాశీలకంగా పని చేస్తున్నాడు.ఆన్లైన్ గేమింగ్ లో అమౌంటు లావాదేవీల కోసం సుమారు 70 మంది స్థానికుల ద్వారా వివిధ బ్యాంకుల్లో తలారి మధు ఖాతాలు తెరిపించి పాసు బుక్కులు సిద్ధం చేసుకున్నాడు. బ్యాంకు పాసు బుక్కులు పేరున్న వ్యక్తులకు రూ.10 వేలు ఇచ్చాడు. అంతేకాకుండా.ఫోన్ పే లావాదేవీల కోసం వేరే వారి పేరున సిమ్ కార్డులు తీయించి.వీటన్నింటినీ డిల్లీలో ఉన్న మిగితా ముఠా సభ్యుల సహకారంతో కార్గో జీన్స్ ప్యాంట్ల పార్శిళ్ల ద్వారా పిలిప్పీన్స్ కు పంపారు.ఫోన్ పే లావాదేవీలన్నీ సదరు సిమ్ కార్డుల ద్వారానే కొనసాగాయి.ఈ కేసు ప్రాథమిక విచారణలో భాగంగా ఈ ముఠా సభ్యులకు సంబంధించి 9 బ్యాంకుల్లో నిల్వ ఉన్న సుమారు రూ.18.20 లక్షల సొమ్మును ఫ్రీజ్ చేయాలని కోరుతూ సంబంధిత బ్యాంకుల అధికారులకు పోలీసులు లేఖలు ఇచ్చారు.ఈ ముఠా గుట్టురట్టు ఇలా :ప్రస్తుతం కొనసాగుతోన్న IPL నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ.పి.జగదేష్ IPS,ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు పర్యవేక్షణలో కళ్యాణదుర్గం అర్బన్ సి.ఐ V.హరినాథ్,రాయదుర్గం రూరల్ సి.ఐ కె.వెంకటరమణ,ఎస్సైలు వై. నాగమధు నబీ రసూల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి బృందంగా ఏర్పడి రాబడిన సమాచారము మేరకు 04.05.2026 వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో కళ్యాణదుర్గం పట్టణం సిద్దపవంక వీధిలోని ఓ ఇంటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తలారి మధుతో మిగితా 09 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి రోలెంట్,డ్రాగన్,క్యాసినో,మోనోపోలో,క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ మరి ఇతర నిషేదిత ఆటలను ఆన్లైన్ యాప్ ద్వారా ఆడుచుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ జోలికెళితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు–జిల్లా ఎస్పీ క్రికెట్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం చట్టపరంగా తీవ్రమైన నేరం.ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఆన్లైన్‌లో ఆడితే ఎవరూ కనుక్కోలేరని భావించడం పొరపాటు. ప్రత్యేక విభాగాల ద్వారా ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అక్రమ కార్యకలాపాలను గుర్తించడం సులభమవుతోంది.గేమింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్‌కు పాల్పడే వారు,నిర్వహించే వారు,మరియు ప్రోత్సహించే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.ఈ వ్యసనం జోలికి వెళ్లి వ్యక్తిగతంగా,కుటుంబపరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు సూచనఇటువంటి అలవాట్లు ఆర్థిక నష్టాలు,మానసిక ఒత్తిడులు మరియు సామాజిక సమస్యలకు దారితీస్తాయి.ప్రజలు చట్టాలను గౌరవిస్తూ,ఇటువంటి అక్రమ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular