📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarఆపన్న హస్తం అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆపన్న హస్తం అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

ఇందుర్తి వాసికి ₹2.50 లక్షల LOC మంజూరు

మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:
నిరుపేదలకు అండగా నిలవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి నిరూపించారు.
ఇందుర్తి గ్రామానికి చెందిన బొయిని రవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ ,నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹2 లక్షల 50 వేల ఎల్.ఓ.సి (LOC) మంజూరు చేయించారు.
ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను రవి తల్లి ఎల్లమ్మకు అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి గారికి ఆమె భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతపూల నరేందర్ (సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు), అందే సురేష్ (చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు), తోట లక్ష్మణ్ (వార్డు సభ్యులు)తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular