ఆపన్న హస్తం అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఇందుర్తి వాసికి ₹2.50 లక్షల LOC మంజూరు మన ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి: నిరుపేదలకు అండగా నిలవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి నిరూపించారు. ఇందుర్తి గ్రామానికి చెందిన బొయిని రవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ ,నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే...