📄 ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆధార్, ఓటర్ కార్డు ఆధారంగా ఎస్.ఐ.ఆర్. సర్వే జరపాలి. ఎస్.ఐ.ఆర్.అమలు హేతుబద్ధంగా ఉండాలి. ఎస్.ఐ.ఆర్. సర్వే...

ఆధార్, ఓటర్ కార్డు ఆధారంగా ఎస్.ఐ.ఆర్. సర్వే జరపాలి. ఎస్.ఐ.ఆర్.అమలు హేతుబద్ధంగా ఉండాలి. ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా అమలుచేయాలి

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి జూన్ 18) స్థానిక భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యాలయంలో,ఉదయం 10 గంటలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) సర్వేపై సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ “ప్రెస్ మీట్”నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్ వి.అన్వేష్,ఏ.రామ్మోహన్, బి.దస్తగిరి రెడ్డి,కే.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.ఎస్.ఐ.ఆర్.లో జరుగుతున్న అహేతుకమైన సర్వేలకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బి.ఎల్.ఓ.లు సర్వే లెక్కలు తీసుకునేటప్పుడు ఆధార్,ఓటర్ కార్డులు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి కనీస ప్రామాణికంగా చూడాలని వారు కోరారు. చట్టబద్ధమైన సిటిజన్షిప్ అర్హతకు హాని కలిగించకుండా అధికారులు జాగృతితో ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నూటికి 70 మంది ఓటర్లకు,జనన ధ్రువీకరణ పత్రాలు, భూమి రెవెన్యూ పత్రాలు, మెట్రికులేషన్ సర్టిఫికెట్లు, నివాసపు రుజువులు గ్రామాలలోనూ,పేదల పేటలోనూ ఉండవని గుర్తించాలని తెలిపారు. ఎస్.ఐ.ఆర్. సర్వేలు హేతుబద్ధంగా జరగాలని వారు హెచ్చరించారు.పేదల అణగారిన వర్గాల,చదువులు,ఆస్తులు లేని వారి ఓట్ల హక్కులను కోల్పోయే పరిస్థితిని తీసుకోనిరాకూడదని వారు తెలిపారు.బతుకుతెరువు కోసం వలస కార్మికులుగా వెళ్లినవారు, ఇతర దేశాలకు ఉపాధి కోసం తరలినవారు,పక్క రాష్ట్రాలలో,పక్క జిల్లాలలో ఉపాధి కొరకై ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు మూడు నెలలకు ఒక మారు,మూడు సంవత్సరాల ఒక మారు వచ్చి వెళుతూ ఉంటారని,వారి ఉపాధి ఉన్న పనిప్రదేశంలో వాళ్లకు ఓట్లు, సిటిజన్షిప్ ఉండదని అటువంటివారిని ఇరుగుపొరుగు వారిని విచారించి జన్మస్థలమైన స్థానికంగానే ఓట్లు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular