గూడూరు మండలం కందలి గ్రామ సమీపం లోని గెలాక్సీ మైన్ లో అక్రమాలు కోకొల్లలు..సిండికేట్ సహాయం,కొందరు మైనింగ్,రెవెన్యూ ప్రభుత్వ అధికారులు తోడ్పాటు తో వందల కోట్ల రూపాయలు దోచేస్తున్న మైనింగ్ మాఫియా
👉52 ఎకరాల ప్రభుత్వ భూమి లో అక్రమ మైనింగ్, అక్రమ నిర్మాణాలు..చోద్యం చూస్తున్న అధికారులు
👉గెలాక్సీ మైన్ లో లీజులు ముగిసిన ప్రభుత్వ భూమి లో అక్రమ మైనింగ్
👉ఫేక్ పత్రాలతో రాజ మార్గం లో మైనింగ్
👉ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..అక్రమార్కులకు కోట్లు
👉వందల కోట్లు విలువ చేసే సుమారు 52 ఎకరాల ప్రభుత్వ భూమి లో అక్రమ మైనింగ్..ఇల్లీగల్ బ్లాస్టింగ్ లు,భారీ పరిశ్రమ నిర్మాణం చేస్తూ వుండడం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యానికి పరాకాష్ట కు చేరింది
👉లీజులు ముగిసిన గెలాక్సీ మైన్ కు యదేచ్ఛగా పర్మిట్లు మంజూరు చేస్తున్న మైనింగ్ అధికారులు తీరు పై విమర్శలు
2018 కేంద్ర నిబంధనలు ప్రకారం 5 హెక్టార్లు దాటిన మైన్ లో డంప్ చేయాలి అంటే స్టాక్ కు EC,పబ్లిక్ ఒపీనియన్ తప్పనిసరి అనే నిబంధనకు పాతర
👉2013లోనే గెలాక్సీ మైన్ ను ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్(IBM) రద్దు
👉గెలాక్సీ మైన్ కు 2024 నవంబర్ లోనే ప్రభుత్వం ఇచ్చిన 50 ఏళ్ల లీజు గడువు ముగిసిపోయింది
👉గడువు ముగిసిన గెలాక్సీ మైన్ కు ఇంకా పర్మిట్లు మంజూరు చేస్తున్న మైనింగ్ అధికారులు
👉ప్రభుత్వ లీజులు ముగిసినా అక్కడ ఉన్న డంప్ లో మెటీరియల్ ఎత్తుకునేందుకు ప్రభుత్వ అనుమతులు తో 6 నెలల సమయం పొందే అవకాశం,లీజు ముగిసి రెండేళ్లు గడచి పోతున్నా గెలాక్సీ మైన్ లో మెటీరియల్ తరలించేందుకు మైనింగ్ అధికారులు పర్మిట్లు ఎలా ఇస్తున్నారు?
👉గెలాక్సీ మైన్ లో అక్రమ తవ్వకాలు జరిపి ఆ మెటీరియ్ లను వివిధ పేర్లతో ఉన్న ఇతర MDL లకు తరలింపు
👉కేవలం 6 నెలల వ్యవధి లోనే మైనింగ్ అధికారులు అండతో అక్రమ మార్గం లో క్వార్జ్ కు పర్మిట్లు పొంది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపద దోచేసిన గెలాక్సీ మైన్ యజమాని
👉ఇటీవలే క్వార్జ్ ను లారీకి క్రేన్ తో లోడ్ చేస్తుండగా ప్రమాద వశాత్తూ గన్ని బ్యాగ్ పైన పడి ఓ కూలీ మరణించినా,ట్రాక్టర్ ప్రమాదం గా చిత్రీకరించినట్టు జోరుగా ప్రచారం
👉లీజులు ముగిసిన మైన్ లు లోని సంపద ప్రభుత్వ సంపద గా గుర్తించాలి,అంటే గెలాక్సీ మైన్ లోని ప్రతి చిన్న రాయి కూడా ప్రభుత్వ సంపద,మరి ప్రభుత్వ సంపద అక్రమంగా కొల్లగొట్టేస్తూ కోట్లు దోచేస్తుంట్ ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు
👉ఇప్పటి కి గెలాక్సీ మైన్ పై కోర్టులో అనేక కేసులు
👉చెన్నై లో గెలాక్సీ మైకా ఎంటర్ ప్రైజెస్ తో రిజిస్టేషన్…మరి అదే పేరుతో నెల్లూరు లో డమ్మీ రిజిస్ట్రేషన్ తో నడుస్తున్న గెలాక్సీ మైన్
👉చట్ట విరుద్ధంగా ఒక వ్యక్తే వివిధ రకాల పేర్లతో MDL లు,GST లు రిజిస్ట్రేషన్,ఆర్ధిక నేరాలు కింద చర్యలు
👉లీజులో ముగిసిన మైన్ లలోని ప్రభుత్వ ఖనిజ సంపదను దోచుకునేందుకు మైనింగ్ మాఫియా కు చట్ట విరుద్ధంగా పర్మిట్ల మంజూరు చేస్తున్న మైనింగ్ అధికారులపై చర్యలు ఏవి?
👉చట్ట విరుద్ధంగా గెలాక్సీ మైన్ కు పర్మిట్లు ఇస్తున్న మైనింగ్ AG,AD లు పాత్ర పై ఉన్నతాధికారుల దృష్టిపెట్టాలి
👉చట్ట విరుద్ధంగా కళ్ళ ముందు అక్రమంగా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు చెందవలసిన ఖనిజ సంపద కొల్ల కొట్టేస్తున్న గెలాక్సీ మైన్ యాజమాన్యం
👉కందలి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు పట్టా భూమి 40 ఎకరాలు మినహాయించి మైన్ లోని మిగిలిన సుమారు 52 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు
👉జిల్లా కలెక్టర్ ఈ గెలాక్సీ మైన్ అక్రమాల పై విచారణ జరపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు
తిరుపతి జిల్లా జూన్ 22ప్రజావాణి గూడూరు మండలం కందలి గ్రామపంచాయతీ పరిధిలో గెలాక్సీ మైకా మైన్ లో వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది కోట్ల రూపాయల ప్రశ్నగా మిగిలిపోయింది,ఈ గెలాక్సీ మైన్ కు మైనింగ్ అనుమతులు 2024 నవంబర్లో ముగిసిపోయినప్పటికీ కొన్ని లక్షల టన్నుల విలువచేసే తెల్ల రాయితో పాటు అనేక ఖనిజ సంపదన నిల్వ ఉంది,ఈ సంపదను ప్రభుత్వం స్వాధీవనం చేసుకోవాలి,కానీ గెలాక్సీ మైన్ యజమాని మాత్రం ఇప్పటికీ అక్కడ మైనింగ్ చేస్తూ నిత్యం కోట్ల రూపాయలు విలువ చేసే క్వార్జ్ ను ఇతర దేశాలకు తరలిస్తూనే వున్నాడు.ఈ అక్రమాలకు మైనింగ్ శాఖ కొమ్ము కాస్తూ లీజులు ముగిసిన మైన్ లోని క్వార్జ్ కు పర్మిట్లు ఇస్తూనే ఉంది, 2013లోనే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ లో సస్పెండ్ గురైన ఈ గెలాక్సీ మైన్ కు 2024 నవంబర్లో నే ప్రభుత్వ లీజులు ముగిసిపోయాయి, లీజులు ముగిసిన ఈ మైన్ లో ఉన్న లక్షల టన్నుల మెటీరియల్ తరలించుకునేందుకు ప్రభుత్వ నిబంధనలలో ఉన్న సడలింపులు కేవలం ఆరు నెలలు మాత్రమే. ఏదైనా లీజులు ముగిసిన మైన్ లో డంపులు క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం ఆరు నెలల సమయం ఇస్తుంది కానీ ఈ గెలాక్సీ మైన్ కు లీజులు ముగిసి ఏడాది పూర్తి అయినా కూడా మైనింగ్ అధికారులు ఇప్పటికీ పరిమితులు ఇస్తూ ఉండడంలోని ఆంతర్యం ఏమిటనేది తెలియడం లేదు,కేవలం కొన్ని నెలల వ్యవధి లో గెలాక్సీ మైన్ లో సుమారు వందల కోట్ల రూపాయల సంపదను తరలించి వేశారంటే పరిస్థితి అర్థం అవుతుంది,సిండికేట్ పేరుతో మైనింగ్ మాఫియా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆక్రమ మైనింగ్ కు కొమ్ముకాస్తూ ఉండడంతో అక్రమ మైనింగ్ దారులకు ఇదో వరంలా మారింది ప్రభుత్వానికి చెందిన సంపదకు లాయల్టి చెల్లించి పర్మిట్లు తీసుకున్న గెలాక్సీ మైన్ యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించింది గోరంతయితే అక్రమ మార్గంలో కొల్లగొట్టింది కొండంత,ఇంత వ్యవహారం నడుస్తున్న ఇటు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నోరు మెదపకపోవడానికి కారణం తమకు అందుతున్న వాటాలేనని ప్రజల ఆరోపిస్తున్నారు,ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ లు ఆక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపుతామని ప్రగల్భాలు పలికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోయినట్టు అక్రమార్కులకు ప్రభుత్వం నేరుగా కొమ్ముకాస్తుందని ఆరోపణలు ఉన్నాయి అవి నిజం చేస్తూ లీజులు ముగిసిపోయిన మైన్ లలోని సంపద మొత్తం ప్రభుత్వానికి చెందవలసి ఉంటే మైనింగ్ మాఫియా మాత్రం యదేచ్ఛగా ప్రభుత్వ సంపదను పబ్లిక్ గానే కొల్లగొడుతున్నా అడిగే అధికారి గాని ఆపే నాయకుడుగాని లేకపోవడంతో గెలాక్సీ మైన్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టే లేకుండా పోయింది
గెలాక్సీ మైన్ లోని అక్రమాల పై మరిన్ని కథనాలుగెలాక్సీ మైన్ సర్వే నెంబర్..63 లో 11.50 ఎకరాలు.సర్వే నంబర్ 68/5 లో 28.60 ఎకరాలు.సర్వే నెంబర్ 68/6 లో 5.28 ఎకరాలు మొత్తం 45.38 ఎకరాల పట్టాభూమి తో పాటు సర్వే నంబర్ 68/4 లో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి మొత్తం 95.38 ఎకరాల లో గెలాక్సీ మైన్ విస్తరించి వుండేది గెలాక్సీ మైన్ గూడూరు రూరల్ కందలి పంచాయతీ లోని సర్వే నెంబర్ 68/4 లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి లో అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్ లు చేస్తూ యదేచ్చగా మైనింగ్ చేస్తున్నారు.. 2024 నవంబర్ లో మైనింగ్ లీజు గడువు ముగిసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలి.కానీ ఈ ప్రభుత్వ భూమి లోనే అక్రమంగా మైనింగ్ తో పాటు బాల్ మిల్లింగ్ పరిశ్రమ కూడా నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ అక్రమార్కులు ఎంత బరితెగించారు,అధికారులు ఎంతకు అమ్ముడుపోయారు అనేది కోట్ల రూపాయలు ప్రశ్న.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ భూ అక్రమాలు,అక్రమ మైనింగ్ పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు




