•లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి చిక్కాడు•
*రూ.25 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
బొల్లారం, జూన్ 18 (ప్రజావాణి): బొల్లారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) రామకృష్ణారెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం చిక్కాడు.
ఏసీబీ డీఎస్పీ కొత్తూరు సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం, బొల్లారం ప్రాంతంలోని పీపీఆర్ హాస్పిటల్ సమీపంలో ఇటీవల ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ కాంట్రాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తి మహమ్మద్ అఫ్రాజ్ నుంచి ఏఈ రామకృష్ణారెడ్డి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం లంచం డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని ఏఈ రామకృష్ణారెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం బొల్లారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, సంబంధిత రికార్డులను పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి చిక్కాడు
RELATED ARTICLES


