ఆధార్, ఓటర్ కార్డు ఆధారంగా ఎస్.ఐ.ఆర్. సర్వే జరపాలి. ఎస్.ఐ.ఆర్.అమలు హేతుబద్ధంగా ఉండాలి. ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా అమలుచేయాలి

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి జూన్ 18) స్థానిక భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యాలయంలో,ఉదయం 10 గంటలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) సర్వేపై సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ "ప్రెస్ మీట్"నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్ వి.అన్వేష్,ఏ.రామ్మోహన్, బి.దస్తగిరి రెడ్డి,కే.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.ఎస్.ఐ.ఆర్.లో జరుగుతున్న అహేతుకమైన సర్వేలకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బి.ఎల్.ఓ.లు సర్వే లెక్కలు తీసుకునేటప్పుడు ఆధార్,ఓటర్ కార్డులు అందరి దగ్గర ఉంటాయి...