అన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం

ఘట్‌కేసర్, మే 15 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద వరంగల్ హైవేపై నూతనంగా నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజీవ్ గృహ కల్ప, సత్యసాయి నగర్ కాలనీ వాసులు కలిసి గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం పార్లమెంట్‌లో తన గళం వినిపించి ప్రాజెక్ట్‌కు ఆమోదం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ ఈటల రాజేందర్‌కు ప్రజలు ధన్యవాదాలు...