📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamప్రాణాపాయ స్థితిలో పసిబాబు.

ప్రాణాపాయ స్థితిలో పసిబాబు.

📰 Generate e-Paper Clip

రోజుకు రూ.2.5 లక్షల వైద్య ఖర్చులు, దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు.

తిరుమలాయపాలెం, ప్రజావాణి:

ఇల్లంతా చిలిపి నవ్వులతో అలరించాల్సిన ఓ పసిబాబు ప్రస్తుతం ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతున్నాడు. మండల కేంద్రమైన తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాణోత్ నరేశ్–అనూష దంపతుల రెండేళ్ల మూడు నెలల కుమారుడు లోహిత్ రాథోడ్‌కు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా మారింది.

మొదట సాధారణ జ్వరంగా ప్రారంభమైన అనారోగ్యం క్రమంగా తీవ్రమై, ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌గా మారింది. ఇటీవల ఒక్కసారిగా పిడుసులు రావడంతో చిన్నారి కుప్పకూలిపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎమ్మారై పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ వ్యాధి ప్రాణాంతకమైందని, తక్షణమే ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కాకాగూడలో ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. రోజుకు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వైద్య ఖర్చులు అవుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. ఒక్క ఇంజెక్షన్ ధర రూ.26 వేలు కాగా, రోజుకు ఒకటి అవసరం అవుతోంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా దాదాపు 12 గంటల సమయం పడుతోందని వారు వెల్లడించారు.రైస్ గోదాంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న తండ్రి నరేశ్‌కు ఈ భారీ ఖర్చులు భరించడం సాధ్యం కావడం లేదు. ఇప్పటివరకు సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, ఇంకా చికిత్స కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. తమ కుమారుడిని కాపాడాలని తల్లిదండ్రులు దాతలను చేతులెత్తి వేడుకుంటున్నారు.సహాయం చేయదలచిన వారు బ్యాంక్ ఖాతా నంబర్ 62220091407 (IFSC: SBIN0065055, SBI ఖమ్మం బ్రాంచ్, ఖాతాదారు: బాణోత్ నరేశ్ కుమార్) కు లేదా ఫోన్ పే/గూగుల్ పే నంబర్లు 9505663345, 7993597599, 9490470959 కు తమవంతు సహాయం అందించాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular