ప్రాణాపాయ స్థితిలో పసిబాబు.
రోజుకు రూ.2.5 లక్షల వైద్య ఖర్చులు, దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. తిరుమలాయపాలెం, ప్రజావాణి: ఇల్లంతా చిలిపి నవ్వులతో అలరించాల్సిన ఓ పసిబాబు ప్రస్తుతం ఆసుపత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతున్నాడు. మండల కేంద్రమైన తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాణోత్ నరేశ్–అనూష దంపతుల రెండేళ్ల మూడు నెలల కుమారుడు లోహిత్ రాథోడ్‌కు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా మారింది. మొదట సాధారణ జ్వరంగా ప్రారంభమైన అనారోగ్యం క్రమంగా తీవ్రమై, ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌గా మారింది. ఇటీవల ఒక్కసారిగా పిడుసులు...