📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్హత ఉన్న లోకల్ అభ్యర్థికి అన్యాయం * న్యాయం చేయమని యువతి ఆవేదన

అర్హత ఉన్న లోకల్ అభ్యర్థికి అన్యాయం * న్యాయం చేయమని యువతి ఆవేదన

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి21)కలసపాడు మండలం,మహానంది పల్లెలో ఆశా వర్కర్ నియామకంలో అన్యాయం జరిగిందని అదే గ్రామానికి చెందిన ఎం సువార్తమ్మ భర్త చిన్నప్ప అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది.అర్హత ఉన్న లోకల్ అభ్యర్థిని అయినా తనను పక్కన పెట్టి నాన్-లోకల్ వ్యక్తికి ఎలా ఇస్తారని సంబంధిత అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థికి పోస్ట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు.ఆశా వర్కర్ నియామకంలో రాజకీయం,డబ్బు ఉంటే చాలు ఎలాంటి నిబంధనలు అక్కర్లేదని బాధితురాలు వాపోయారు.కడప డి ఎం అండ్ హెచ్ వో నిబంధనలను సైతం లెక్కచేయకుండా నాన్ లోకల్ అయిన వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారని పై అధికారులకు ఫిర్యాదు చేసినను, సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆమె మీడియా ముందు తన బాధను వ్యక్తపరిచారు.
జిల్లా అధికారులు వెంటనే నిజ నిజాలు తెలుసుకుని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular