నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 19 (ప్రజావాణి)
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో ఈరోజు స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఎస్ సంతోషకుమార్, బి శ్రీదేవి ల ఆర్థిక సహకారం తో క్రీడా దుస్తులు విద్యార్థులకు అందజేశారు, విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయిలో మొదటిసారిగా కరాటే శిక్షణను ఉపాధ్యాయుల సహకారంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యాభిమాని, స్థానిక గ్రామస్తులు మద్దుల గోపాల్ రెడ్డి పాల్గొని విద్యార్థుల ఫోటోలు కలిగిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాఠశాల అభివృద్ధికై తన పూర్తి సహకారం ఎల్లవేళలా ఉంటుందని, పాఠశాలకు కావాల్సిన వాటర్ ప్యూరిఫైయర్, కంప్యూటర్స్, పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్, జారుడు బల్ల, పక్క గ్రామాల నుండి విద్యార్థులు రావడానికి రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడిపల్లి కొమురమ్మ, అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ ఉరుమెట్ల మంగ, గోడిశెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేశం, గణేష్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.




