📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కాలుష్య కోరల్లో 100 పడకల ఆసుపత్రి

కాలుష్య కోరల్లో 100 పడకల ఆసుపత్రి

📰 Generate e-Paper Clip

*కాలుష్య కోరల్లో 100 పడకల ఆసుపత్రి!*

కెమిలాడ్స్ ఫ్యాక్టరీ కాలుష్యానికి ముక్కు మూసుకుని ఆసుపత్రికి రావాల్సిన దుస్థితి

రోగ నివారణకు వస్తే కొత్త రోగాలు చుట్టుముడుతున్నాయంటూ రోగులు, స్థానికుల తీవ్ర ఆగ్రహం

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట ప్రాంతీయ (100 పడకల) ప్రభుత్వ వైద్యశాల పరిసరాలు తీవ్ర దుర్గంధం, రసాయన కాలుష్య పొగలతో అట్టుడుకుతున్నాయి. వైద్యం కోసం వచ్చే నిరుపేద రోగులకు, చికిత్స పొందుతున్న బాధితులకు సమీపంలోని కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం శాపంగా మారింది. ఆరోగ్యం బాగుపడటానికి ఆసుపత్రికి వస్తే, అక్కడ వెలువడే విషపూరిత వాయువులు, దట్టమైన పొగ వల్ల మరింత అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు, బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి ముందే రసాయనాల ఘాటు!
100 పడకల ఆసుపత్రికి కూతవేటు దూరంలో ఉన్న కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీ నుండి ప్రతినిత్యం భారీగా రసాయన వ్యర్థాలు, పొగ విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో గాలిలో ఘాటైన రసాయన వాసనలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని వార్డుల్లో ఉన్న రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో చేరిన బాధితులు ఈ కాలుష్యం ధాటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యం ఎంతవరకు సమంజసం?
ప్రజారోగాన్ని పరిరక్షించాల్సిన ఆసుపత్రి ముందే ఇంతటి ప్రమాదకర కాలుష్యం విస్తరిస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ ) అధికారులు, స్థానిక యంత్రాంగం నిద్రమత్తు వదలకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను గాలిలోకి, నీటిలోకి వదులుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
బోర్డు నిరసన – తక్షణమే చర్యలు తీసుకోవాలి!
ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న ప్రజలు, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రాంతీయ వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అశ్వారావుపేట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.