దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిద్దాం.. నవంబర్ 29న కరీంనగర్‌కు భారీగా తరలివెళ్దాం
సిరిసిల్ల ప్యాక్స్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు బండి దేవేందర్ యాదవ్
తంగళ్ళపల్లి ప్రజావాణి నవంబర్ 27 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షను స్మరించుకుంటూ నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సిరిసిల్ల ప్యాక్స్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు బండి దేవేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో మనది పోరాట చరిత్ర అని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బండి దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు జరిగాయని, వాటిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
నవంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

