📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణస్కీం వర్కర్ల హక్కుల సాధనకు చలో ఢిల్లీ

స్కీం వర్కర్ల హక్కుల సాధనకు చలో ఢిల్లీ

📰 Generate e-Paper Clip

స్కీం వర్కర్ల హక్కుల సాధనకు చలో ఢిల్లీ

కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలి – సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 27

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఆందోళనలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొనాలి

పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, స్కీం వర్కర్ల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా జి. జ్యోతి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తల్లీబిడ్డల సంరక్షణ, ప్రజలకు ఆరోగ్య సేవలు, పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం వారి శ్రమను దోపిడీ చేస్తోందని విమర్శించారు.

మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం స్కీం వర్కర్ల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్కీం వర్కర్లకు కనీస వేతనంగా రూ.42 వేలు నిర్ణయించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆశా, అంగన్‌వాడీ తదితర స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

స్కీం వర్కర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆశా, అంగన్‌వాడీ తదితర స్కీం వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా యూనియన్ నాయకులు వనజరాణి, సులోచన, శారద, వరలక్ష్మి, సరస్వతి, శ్రీలత, వనిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.