📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవనభోజనాలు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- కురుపాటి సుదర్శన్

వనభోజనాలు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- కురుపాటి సుదర్శన్

📰 Generate e-Paper Clip

*వనభోజనాలు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- కురుపాటి సుదర్శన్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

మాదిగ ఉపకులాల కార్తీకమాస వనభోజనాలు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కురుపాటి సుదర్శన్ పిలుపు నిచ్చారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఈనెల 29వ తారీఖున మాదిగల అలయ్ బలయ్ కార్తీకమాస వనభోజనాల కార్యక్రమాన్ని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమ ముఖ్య ఉద్దేశం మాదిగ మరియు మాదిగ ఉపకులాల మధ్య ఐక్యతను పెంపొందించడం సామాజిక రాజకీయ చైతన్యాన్ని బలోపేతం చేయటం మాదిగ ఉపకులాల హక్కులు అభివృద్ధిపై చర్చించటం భవిష్యత్తు కార్యాచరణకు సమిష్టి నిర్ణయాలు తీసుకోవటం బహుజన సమాజంలో ఐక్యత సోదరా భావాన్ని చాటి చెప్పడం లాంటివి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాదిగ మంత్రులు ఎమ్మెల్యేలు మాదిగ మేధావులు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ జిల్లాల మాదిగ ముఖ్య నాయకులు హాజరు కారున్నారని తెలిపారు. ఈ వనభోజన మహోత్సవానికి మాదిగ – ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.