సేంద్రీయ సాగు బహు బాగు:ఎ.డబ్ల్యూ.పి.ఎల్ ట్రైనర్స్
ప్రజావాణి,ఇనుగుర్తి: సేంద్రీయ సాగుతో భూమిలో ఉన్న కెమికల్స్ తొలగిపోయి బలం చేకూరుతుందని,అదే సమయంలో రైతులకు లాభదాయకమైన దిగుబడులు లభించి లాభదాయకం అవుతుందని భారతీయ కంపెనీ ఏడబ్ల్యుపిఎల్ వెల్నెస్ కంపెనీ అగ్రికల్చర్ ట్రైనర్ నరేందర్,హెల్త్ ట్రైనర్ కరుణాకర్,వెల్త్ ట్రైనర్ వసంతరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ఆరోగ్య భారత్ సంపన్నభారత్(హెల్త్ ఇండియా వెల్త్ ఇండియా) లో భాగంగా రైతులకు సహజ సాగుపై భారతీయ కంపెనీ ఆశ్లీ పిఎస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు సేంద్రియ సాగు కు కంపెనీ సమర్థవంతమైన ప్రోడక్ట్లను తయారు చేసిందని ఇవి రసాయన ఎరువులు,పురుగుల మందుల కన్నా అతి తక్కువ ధరలకు లభించి భూములకు,పంటలకు అత్యధిక మేలు చేకూరుస్తాయని చెప్పారు. దేశానికి 16 సం.లు సేవలందించిన మేజర్ సంజీవ్ కుమార్ భారత దేశ రైతులను, వారి భూములను రసాయన ఎరువులు, సాగు నుంచి కాపాడడం కోసం సంబంధిత కంపెనీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ బైరు రమేష్,రైతులు పాల్గొన్నారు బైరు శ్రీనివాస్ గౌడ్,బైరు శ్రీరాములు,గుండ్ల యాకయ్య,బత్తిని రాములు,బైరు యాదగిరి,ప్రసాద్,మురళి, నాయిని కొమరయ్య,పంజాల దేవరాజు, బైరు యాదగిరి,వేణు,పంజాల రమేష్, చెడుపాక రమేష్,మునిగింటి దర్గయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.
సేంద్రీయ సాగు బహు బాగు:ఎ.డబ్ల్యూ.పి.ఎల్ ట్రైనర్స్
RELATED ARTICLES

