*స్మార్ట్ రేషన్ కార్డుతో లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు : సర్పంచ్ భీమి బాయి*
*పిచేర్యాగడి తాండలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
జహీరాబాద్, నవంబర్ 25 (ప్రజావాణి): స్మార్ట్ రేషన్ కార్డుతో లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయని, స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందవచ్చని పిచరేగాడి తండా సర్పంచ్ రామావత్ భీమి బాయి అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని పిచేర్యాగడి తాండలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామావత్ భీమి బాయి, కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్ ల చేతుల మీదుగా నూతన కార్డులను అందజేశారు. నూతన రేషన్ కార్డుల అందజేతతో తమకు నిత్యావసర సరుకుల పంపిణీలో సౌలభ్యం కలుగుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పాలన అధికారి శ్రీనివాస్, స్థానిక వార్డు సభ్యులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

