📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబి.కెపల్లి లో తొలిముద్ద ప్రారంభించిన సర్పంచి

బి.కెపల్లి లో తొలిముద్ద ప్రారంభించిన సర్పంచి

📰 Generate e-Paper Clip

బి.కెపల్లి లో తొలిముద్ద ప్రారంభించిన సర్పంచి
ప్రజావాణి,నెల్లికుదురు: చిన్నారుల ఎదుగుదల లక్ష్యంగా ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ అందించే తొలిముద్ద కార్యక్రమాన్ని మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లిలో సర్పంచి డా.చిర్ర యాకాంతం గౌడ్ బుధవారం స్థానిక అంగన్వాడి సెంటర్ లో ప్రారంభించారు. చిన్నారులకు కిచిడి వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సం.ల లోపు ఫ్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించడానికి తొలిముద్ద కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం,అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ పథకం లక్ష్యమన్నారు. దీనిని సద్వినియోగపరిచేందుకు చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పెరుమాండ్ల శ్రీజ్యోతి, మాదగాని కవిత, దాసరి కవిత, ఆయాలు,పిల్లలు,తల్లులు, గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.