**ప్రజాసేవే లక్ష్యంగా.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు ముందుకు సాగాలి**
చెన్నారావుపేట, నవంబర్ 25:
బీజేపీ కార్యకర్తలు ప్రజాసేవే లక్ష్యంగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు.
నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో మండల అధ్యక్షులు దనసరి రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి గంట రవికుమార్, జిల్లా ప్రభారీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని, SIRపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ప్రతి బూత్‌లో కమిటీలను బలోపేతం చేసి, బూత్ స్థాయి నుంచి పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అవినీతి పాలన, కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, మండల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


