📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ31వ వార్షిక ప్రార్థనా కూటమి, చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం

31వ వార్షిక ప్రార్థనా కూటమి, చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*31వ వార్షిక ప్రార్థనా కూటమి, చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం*

• క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రేయర్ సెంటర్‌లో ఘనంగా 31వ వార్షికోత్సవ వేడుకలు

సదాశివపేట | నవంబర్ 25 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

సదాశివపేట, నిజాంపూర్ రోడ్ బైపాస్‌లోని క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రేయర్ సెంటర్‌లో 31వ వార్షిక ప్రార్థనా కూటమి మరియు చర్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చర్చి ఫౌండర్, పాస్టర్ దుబ్బ కృపవరం ముఖ్యంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పలువురు పాస్టర్లు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవాణి మినిస్ట్రీకి చెందిన జయానంద్, జోసెఫ్ శెట్టి, పాస్టర్ జయపాల్ రెడ్డి, సంగారెడ్డి మినిస్ట్రీకి చెందిన సత్యపాల్ తదితర పాస్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన పాస్టర్లకు, ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చర్చి ఫౌండర్ పాస్టర్ దుబ్బ కృపవరం పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.