📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్వాహన తనిఖీలో జియో టవర్ కాపర్ వైర్ దొంగ అరెస్ట్..  సీఐ పి. సత్యనారాయణ...

వాహన తనిఖీలో జియో టవర్ కాపర్ వైర్ దొంగ అరెస్ట్..  సీఐ పి. సత్యనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి) : వృత్తిరిత్యా జియో టవర్ టెక్నీషియన్ కాని జిల్లా కేంద్రంలో జరిగిన వాహన తనిఖీలో భాగంగా జియో టవర్ కాపర్ వైర్ ను దొంగిలిస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జనగామ సీఐ పి. సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. మంగళవారం జనగామ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ వెస్ట్ జోన్ జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు ఇంచార్జీ ఏసీపీ భీమ్ శర్మ పర్యవేక్షణలో జనగామ ఎస్ఐ టి.సుమన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జనగామ చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహించామని సీఐ పి.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి TS 07 JN 9341 నంబర్ గల హోండా యూనికార్న్ బైక్‌ పై మందు సంచి పెట్టుకుని వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడని, వెంటనే స్పందించిన తమ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారించారని, జనగామ పట్టణలోని ముస్లిం మైనారిటీ కాలనికి చెందిన మహమ్మద్ అజీజ్ (39), తండ్రి రబ్బాని, వృత్తి జియో టవర్ టెక్నీషియన్ అని తెలిపాడని వివరించారు. అతని వద్ద ఉన్న సంచిలో కాల్చి పెట్టిన కాపర్ వైర్ ఉండడంతో దాని గురించి ప్రశ్నించగా, తాను గతంలో జనగామ శివారు ప్రాంతాలైన పెద్ద పహాడ్, వడ్లకొండ, సిద్దెంకి, పట్టణంలోని బాణాపురం, జీడికల్, రఘునాథపల్లి తదితర గ్రామాల్లోని జియో టవర్లలో ఉన్న కాపర్ వైర్లను దొంగిలించి అమ్ముకునే వాడినని, వచ్చిన డబ్బులతో తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేవాడినని ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పూర్తి విచారణ అనంతరం మంగళవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చురుకుగా ప్రతిభ కనబరిచిన తమ పోలీస్ సిబ్బంది బి.కృష్ణ, బి.కరుణాకర్, బి.భాస్కర్ మరియు ఐడీ అసిస్టెంట్ సల్మాన్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ మరియు వెస్ట్ జోన్ డీసీపీ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.