📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్అర్ధరాత్రి దుప్పట్ల పంపిణీతో మానవత్వం చాటిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్

అర్ధరాత్రి దుప్పట్ల పంపిణీతో మానవత్వం చాటిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25 (ప్రజావాణి): చలికాలంలో రోడ్ల పక్కన, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిద్రిస్తూ చలికి ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులు, యాచకులకు అండగా నిలిచేందుకు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది.

ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన “చలిని తరిమేద్దాం – దుప్పట్ల పంపిణీ కార్యక్రమం”లో భాగంగా జనగామ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 45 దుప్పట్లు పంపిణీ చేశారు.

జనగామ బస్టాండ్‌లో నివసిస్తున్న నిరాశ్రయులు, బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అభాగ్యులు, రోడ్ల పక్కన నిద్రిస్తున్న నిరుపేదలకు, జనగామ రైల్వే స్టేషన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథలు, అభాగ్యులకు, అలాగే నెల్లుట్ల శివారులో పాత కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఫౌండేషన్ సభ్యులు ఆయా ప్రాంతాలకు వెళ్లి చలిలో వణుకుతున్న వారిని గుర్తించి ఒక్కొక్కరికి దుప్పటితో పాటు బిస్కెట్ ప్యాకెట్లను కూడా అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ… మన దగ్గర ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పంచినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.” ఈ కార్యక్రమానికి పిలుపునివ్వగానే ఫౌండేషన్ సభ్యులు, వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు గొప్ప మనసుతో స్పందించారని, వారి సహకారం వల్లే కార్యక్రమం విజయవంతమైందన్నారు. రాత్రి వేళ చలిలో వణుకుతున్న అభాగ్యుల వద్దకు వెళ్లి దుప్పట్లు అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, వారి ముఖాల్లో కనిపించిన ఆనందమే తమ సేవకు నిజమైన ప్రతిఫలమని తెలిపారు. సమాజంలో కనీసం ఒక దుప్పటి కూడా లేని అభాగ్యులు ఇంకా ఉన్నారని, వారి జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ ఫౌండేషన్ లక్ష్యమని, సహకరించిన ప్రతి దాతకు, సభ్యునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మై రెడీమర్ స్కూల్‌కు చెందిన నాగాలాండ్ సునప్ జమీర్, అచంగ్ మేడం, ఫౌండేషన్ సభ్యులు శేఖర్ బేతపూడి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.