📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగూడెం గుట్ట దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

గూడెం గుట్ట దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

గూడెం గుట్ట దేవస్థానం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
డైరెక్టర్‌గా ఆకుల తిరుపతి నియామకం
దండేపల్లి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం స్వామివారి సన్నిధిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల తిరుపతిని దేవస్థానం పాలకవర్గ డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆకుల తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి సేవలో, దేవస్థానం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నెపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నగేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తే నారాయణ, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.