ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం
ద్వారక గ్రామపంచాయతీలో పథకం ప్రారంభం
దండేపల్లి, నవంబర్ 24 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని దండేపల్లి మండలం ద్వారక గ్రామపంచాయతీలో మంగళవారం సర్పంచ్ మురుమడుగుల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి హారిక వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి లాగిశెట్టి సతీష్, వార్డు సభ్యుడు బొమ్మెనా సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు ఈ పథకంపై అవగాహన కలిగి, అర్హత మేరకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

