జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): కొమురవెల్లి మండలం మర్రి ముస్త్యాల గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, పంటలు సమృద్ధిగా పండి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తురాయి నవీన్ గౌడ్, గ్రామ సర్పంచ్ జంగాని రవి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బొచ్చు ఎల్లయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పుల రాజు, నాయకులు లింగంపల్లి కనకరాజు, చింతల రమేష్, స్వాములపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

