📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత.. తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కారం.. యువతకు ఆదర్శంగా లిఖిల్

అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత.. తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కారం.. యువతకు ఆదర్శంగా లిఖిల్

📰 Generate e-Paper Clip

అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మికత.. తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కారం.. యువతకు ఆదర్శంగా లిఖిల్

శబరిమల శ్రీ మణికంఠ స్వామి దర్శనం.. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇంటికి చేరిక

అమీన్పూర్, నవంబర్ 23 (ప్రజావాణి):అయ్యప్ప స్వామి దీక్షతో ఆధ్యాత్మికతను చాటుకుంటూ, తల్లిదండ్రులకు పాదపూజ చేసి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిన ఈర్ల లిఖిల్ ముదిరాజ్ యువతకు ఆదర్శంగా నిలిచారు. బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ పెద్ద కుమారుడైన లిఖిల్ అయ్యప్ప మాలధారణ చేసి కఠిన నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగించారు. స్వగృహం నుంచి శబరిమల వరకు పాదయాత్రగా వెళ్లి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మణికంఠ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారి కృపతో ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.శబరిమల యాత్ర అనంతరం గురుస్వాముల సూచన మేరకు లిఖిల్ తన తల్లిదండ్రులైన ఈర్ల రాజు ముదిరాజ్ దంపతులకు సంప్రదాయబద్ధంగా పాదపూజ నిర్వహించి ఆశీస్సులు పొందారు. భగవంతుడిని ఆరాధించడంతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి గౌరవించడం భారతీయ సంస్కృతిలోని గొప్ప విలువలకు నిదర్శనమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. తన కుమారుడు ఎంతో ఇష్టంతో అయ్యప్ప మాలధారణ చేసి, కఠిన నియమ నిష్ఠలతో శబరిమల యాత్ర పూర్తి చేసి క్షేమంగా తిరిగి రావడం తండ్రిగా ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందన్నారు. గురుస్వాముల సూచన మేరకు తమకు పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకోవడం మరింత సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. దేవుడిని ఆలయంలో ఆరాధించడం ఎంత గొప్పో.. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్లో దైవాన్ని చూడటం అంతకంటే గొప్ప విషయమని పేర్కొన్నారు.
నేటి యువత ఆధునికతను అందిపుచ్చుకుంటూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ విలువలను గౌరవించాలని సూచించారు. అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, సహనం, ఆత్మనిగ్రహం, సమానత్వం, భక్తిభావం వంటి గొప్ప లక్షణాలను నేర్పుతుందని అన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురువుల పట్ల భక్తి, పెద్దల పట్ల వినయం నేర్పించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.