📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణడ్రగ్స్ జూదం పై అవగాహన కల్పించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి

డ్రగ్స్ జూదం పై అవగాహన కల్పించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*డ్రగ్స్ జూదం పై అవగాహన కల్పించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి*

నందమూరి కాలనీలో కార్డెన్ చర్చ్ నిర్వహించిన ఎస్సై సాయి కిషోర్ రెడ్డి

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 23

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంపోలీసువారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ సూచనతో ఈరోజు నందమూరి కాలనీ నందు కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం. చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కార్డెన్ చర్చిలో భాగంగా మొత్తం 120 ఇళ్ళను సోదా చేయడం జరిగింది. మొత్తం 54 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, రెండు కార్లు యొక్క డాక్యుమెంట్లు తనిఖీ చేయగా వాటిలో ఐదు ద్విచక్ర వాహనాల యొక్క డాక్యుమెంట్లు సరిగా లేనందున వాటిని సీజ్ చేయడం జరిగింది, అలాగె ఒక బెల్ట్ షాప్ నందు 64 క్వార్టర్ లిక్కరు బాటిల్స్ కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నందమూరి కాలనీ వాసులందరికీ గంజాయి మరియు సైబర్ నేరాలు మరియు మైనర్ డ్రైవింగ్ అలాగే కోడిపందెం మరియు పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు వంటి వాటి జోలికి వెళ్లకూడదని వాటి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే పోలీస్ వారికి తెలియజేయాలని వివరించడం జరిగింది. కావున అశ్వరావుపేట మండల ప్రజలందరూ తెలియజేయునది ఏమనగా ఏ ఒక్కరు కూడా గంజాయి బారిన పడకుండా ఉండాలని అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకుండా, రాబోయే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరూ కూడా జూద శిబిరాలు నిర్వహించిన వాటిలో పాల్గొన్న చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ వారు తరఫున తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో అశ్వరావుపేట సిఐ నాగరాజు రెడ్డి. మరియు అశ్వరావుపేట ఎస్సైలు మరియు దమ్మపేట ఎస్ఐ. మరియు అశ్వారావుపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.