హైకోర్టు జడ్జి ఆశీస్సులు, ప్రజల ప్రేమతో హనుమంతు రాక
పదవి లేకపోయినా సేవ చేసిన మనిషి, ఇప్పుడు ప్రజల కోసం రాజకీయాల్లోకి.?
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్, బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జాటోత్ హనుమంతు రాజకీయాల్లోకి రావాలని శ్రేయోభిలాషులు, ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు.
హైకోర్టు జడ్జి మోతీలాల్ నాయక్ గారి ఆశీస్సులతో ఆయన రావాలని ప్రజల కోరిక. పెద్దల ఆశీర్వాదం, ప్రజల ప్రేమ ఉంటే ఏ బిడ్డకైనా ధైర్యం వస్తుంది.
హనుమంతు గారు పదవి కోసం సేవ చేయలేదు. పదవి లేకపోయినా సేవ చేశారు. బస్టాండ్ నిర్మాణం కోసం ముందుండి నడిపారు. ఉన్నత పాఠశాలకు వాటర్ నిర్మాణానికి హామీ ఇచ్చి, పిల్లల దాహం తీర్చారు. అదే ఆయన గొప్పతనం.
అందుకే సూర్య నేని ప్రసాద్ రావు, మురళీధర్ రావు, లక్ష్మీదేవి పేట తండావాసులు, మదనపల్లి గ్రామస్థులు, పుర ప్రముఖులు అందరూ ఒక్క మాటగా చెప్తున్నారు. హనుమంతు గారు రావాలి.
ఆయన మిత్రులు చంద్రగిరి రాజయ్య, పెండ్యాల సలేంద్రం, గోస్కుల సారయ్య, ఎస్ఐ నారాయణ , ఎర్రబెల్లి గోపాల్ రావు,అల్లం ఒదెలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మాటలు చెప్పే నాయకుడు కాదు, పని చేసి చూపించే మనిషి కావాలని వారి నమ్మకం.
కబడ్డీలో ప్రత్యర్థిని పట్టి పడేసిన పట్టుదల, బ్యాంకులో ప్రజల కష్టం తీర్చిన అనుభవం, ఇప్పుడు ఊరి కోసం వాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
హనుమంతు గారు వస్తే, ఊరు బాగుపడుతుంది. ఇది ప్రజల మాట.
మన ప్రజావాణి, ప్రజల గళం.

