కూటిగల్ అరే వెంకయ్య పార్థివ దేహానికి సీపీఐ నాయకులు ఘన నివాళులు
మద్దూరు నవంబర్23, ప్రజా వాణి,
సీపీఐ కూటిగల్ గ్రామ శాఖ కార్యదర్శి ఆరే ఉపేందర్,మాజీ మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు ఆరే సాయిలు తండ్రి ఆరే వెంకటయ్య (88) మృతి పట్ల సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, దూల్మిట్ట మండల కార్యదర్శి వలబోజు నరసింహాచారి, డివిజన్ నాయకులు నంగి కనకయ్య, గూడెపు సుదర్శన్ లు ఈరోజు దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

