📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విన్జమూరి వెంకట్ రెడ్డి

రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విన్జమూరి వెంకట్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విన్జమూరి వెంకట్ రెడ్డి*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 22 (ప్రజావాణి): మంచాల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు విన్జమూరి వెంకట్ రెడ్డి దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విన్జమూరి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.