📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్షాబాద్ ముద్దెంగూడ, కక్కులూరు అంగన్వాడి కేంద్రంలో మురిగిన కోడిగుడ్లు

షాబాద్ ముద్దెంగూడ, కక్కులూరు అంగన్వాడి కేంద్రంలో మురిగిన కోడిగుడ్లు

📰 Generate e-Paper Clip

పట్టించుకోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు

బాలింతలకు తప్పని తిప్పలు

షాబాద్ మండలంలో గాడి తప్పిన అంగన్వాడీ కేంద్రాలు

షాబాద్ ప్రతినిధి, మన ప్రజావాణి

అదో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పథకం. కానీ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం మూలంగా దారి తప్పుతోంది.

షాబాద్ మండలంలో గాడి తప్పిన అంగన్వాడీ కేంద్రాలు

బాలింతలకు తప్పని తిప్పలు

షాబాద్ ప్రతినిధి, మన ప్రజావాణి

పట్టించుకోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు

షాబాద్ ముద్దెంగూడ, కక్కులూరు అంగన్వాడి కేంద్రంలో మురిగిన కోడిగుడ్లు

అదో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పథకం. కానీ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం మూలంగా దారి తప్పుతోంది. దీంతో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రజావాణి ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు షాబాద్ మండలం ముద్దెంగూడ అంగన్వాడీ కేంద్రంలో మురుగి న కోడిగుడ్లు చిన్నపిల్లలు బాలింతలు గర్భిణీ స్త్రీలకు అందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత ఐసిడిఎస్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని పలువురు మహిళలు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవలు కింద ఆరేళ్ల లోపు పిల్లలు గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఆహారం నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో కోట్లాది రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న నేపథ్యంలో అవినీతి అధికారులు నిర్లక్ష్యం తోడు కావడంతో పర్యవేక్షణ కరువై మురిగిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం షాబాద్ మండల వ్యాప్తంగా పలు అనుమానాలు విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ముందస్తు పాఠశాల విద్యా టీకాలు మరియు ఆరోగ్య పరీక్షలను అందించడం బాల్య మరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అయినప్పటికీ కొందరు ఐసిడిఎస్ అధికారుల నిర్వాకం వలన నీరు కారి పోతుందని ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని పలువురు తల్లిదండ్రులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఐసిడిఎస్ సూపర్వైజర్ సిడిపిఓపై శాఖపరమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గుడ్ల ను నాణ్యతలేని పాల ప్యాకెట్లు నాసిరకంగా సరఫరా చేస్తున్న ఏజెన్సీ పై చర్యలు తీసుకొని భవిష్యత్తులో నాణ్యమైన పౌష్టికాహారం అదే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ముక్తకంఠంతో కోరుతున్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular