బెజ్జంకి, జూలై 27 (ప్రజావాణి)
సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం,నేరాల నివారణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేయడం లక్ష్యంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ గ్రామంలో పోలీస్ కళాభృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి బెజ్జంకి ఎస్సై తిరుపతి హాజరై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని,తెలుపుతూ,అలాగే ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్లు, యూపీఐ పిన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, తెలియని లింకులు, ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.అనంతరం పోలీస్ కళాభృందం సభ్యులు పాటలు, నాటికలు,సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళలు, చిన్నారుల భద్రత, పౌరుల బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



