📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguపార్టీలకతీతం... మానవత్వమే మహోన్నతం .మంత్రి సీతక్క.

పార్టీలకతీతం… మానవత్వమే మహోన్నతం .మంత్రి సీతక్క.

📰 Generate e-Paper Clip

పార్టీలకతీతం… మానవత్వమే మహోన్నతం
.మంత్రి సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

రాజకీయ రంగులు వేరైనా రక్తంలో మానవత్వం ఒక్కటేనని మంత్రి దనసరి అనసూయ సీతక్క మరోసారి నిరూపించారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని సీతక్క గారు పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం నింపి, ఆప్యాయంగా మాట్లాడారు.
పార్టీలు గీతలు గీస్తాయి, కానీ ప్రేమకు, పరామర్శకు గీతలు ఉండవని తన చేతలతో చాటారు. ప్రత్యర్థి కాదు… బాధలో ఉన్న మనిషే ముందని, పదవికంటే పరమైనది మానవత్వమని సీతక్క నిరూపించారు.కష్టకాలంలో పలికిన ఓదార్పు మాట వేల ప్రసంగాల కంటే గొప్పదని ప్రజలు కొనియాడుతున్నారు. చాచిన చేయి, చూపిన ఆప్యాయతే నిజమైన ప్రజా నాయకత్వానికి నిర్వచనమని అంటున్నారు.
పార్టీల కన్నా మానవత్వమే మిన్న అనే సందేశాన్ని సజీవంగా నిలిపిన సీతక్క గారికి అన్ని పార్టీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*బై రిపోర్టర్‌ శ్రీకాంత్ ములుగు*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular