**పోలియో రహిత సమాజమే లక్ష్యం.. వేలేరులో పల్స్ పోలియో ప్రారంభం!**
వేలేరు మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.
వేలేరు పీహెచ్‌సీ, హెల్త్ సబ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్‌లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేఘన, హెచ్‌ఓ, ఏఎన్‌ఎం కనకమ్మ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

