📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణశాలపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ కూరపాటి అశోక్

శాలపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ కూరపాటి అశోక్

📰 Generate e-Paper Clip

**శాలపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ కూరపాటి అశోక్**

వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో చిన్నారులకు పోలియో వ్యాధి నుంచి శాశ్వత రక్షణ కల్పించే లక్ష్యంతో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తులో అంగవైకల్యానికి కారణమయ్యే పోలియో వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పోతారబోయిన సతీష్, ANM శ్యామల రాణి, ఆశా వర్కర్ అందే వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సరస్వతి, కవిత, వార్డు సభ్యులు కాట్రేవుల రాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు.. పోలియో రహిత భారతదేశమే మన లక్ష్యం!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.