మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని మర్యా పూర్వకంగా కలిసిన కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 21 మార్కాపురం, మార్కాపురం జిల్లా
మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారిని శనివారం కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవంబర్ 26 వ తేదిన జరిగే సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ ఎం. విజయ సునీత గారికి వినతి పత్రాన్ని సమర్పించారు.కనిగిరి నియోజకవర్గం లోని ఆరు మండలాలకు సంబందించిన సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను సంబందించిన పూర్తి వివరాలు అందజేసారు. సమస్యాత్మక పోలింగ్ బూత్‌లు మరియు హై-రిస్క్ ప్రాంతాలపై మీరు ప్రత్యేక దృష్టి సారించాలని,స్థానిక పోలీసులతో పాటు, సమస్యాత్మకమైన మరియు అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు కేంద్ర బలగాలను నియమించాలని,హై-రిస్క్ ప్రాంతాల్లోని ప్రతి పోలింగ్ బూత్ లోపల, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలింగ్ ప్రక్రియను జిల్లా నిఘా కేంద్రం నుండి నేరుగా పర్యవేక్షించేలా వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని కల్పించాలని పోలింగ్ బూత్‌ల పరిసర ప్రాంతాలలో మరియు గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు.కూటమి పాలనలో ఓటర్లతో పాటు ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు.ఇటీవల వెరిఫికేషన్ పక్రియలో భాగంగా ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరించిన తీరును ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ వైసీపీ బలపరిసిన అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలని ఈ సందర్భంగా ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గారు మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి రూరల్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి, వైఎస్సార్సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

