📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజాతీయ రహదారిపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు నమోదు!

జాతీయ రహదారిపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు నమోదు!

📰 Generate e-Paper Clip

జాతీయ రహదారిపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు నమోదు!
సోషల్ మీడియాలో వీడియోల పోస్టింగ్.. యువతకు కూసుమంచి పోలీసుల హెచ్చరిక
కూసుమంచి నవంబర్ 22 (మన ప్రజావాణి) ప్రతినిధి
: జాతీయ రహదారిపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ, వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న యువకుడిపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచి మండలం జీల్చెరువు గ్రామానికి చెందిన గోపీ హుస్సేన్ (23) జాతీయ రహదారిపై ప్రమాదకరమైన రీతిలో బైక్ స్టంట్లు చేస్తూ, ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు యువతను హెచ్చరిస్తూ.. సరదా కోసం జాతీయ రహదారులపై ప్రమాదకరమైన బైక్ విన్యాసాలకు పాల్పడవద్దని సూచించారు. ఇలాంటి స్టంట్ల వల్ల సొంత ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు.
బైక్ స్టంట్లు చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం గొప్పతనం కాదని, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కూసుమంచి పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.