📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం

రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం

📰 Generate e-Paper Clip

రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో
EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22

మిర్యాలగూడ
*EHS ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త!*
*22 నవంబర్ 2026, ఆదివారం నేడు రివర్ హాస్పిటల్స్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం*
రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో
EHS కార్డుదారులకు పలు రకాల వైద్య పరీక్షలు ఉచితం
మిర్యాలగూడ, నవంబర్ 22
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మిర్యాలగూడలోని రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం, నవంబర్ 22) ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులోకి వచ్చిన ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
ఈ శిబిరాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ సమక్షంలో ప్రారంభించనున్నారు.
ఈ శిబిరంలో భాగంగా వైద్యుల ఉచిత సంప్రదింపులతో పాటు ECG, 2D ఎకో, అల్ట్రాసౌండ్, ENT ఎండోస్కోపీ, ఎక్స్‌రే, ప్రాథమిక రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.
అంతేకాకుండా నూతన EHS పథకంలో అందుబాటులో ఉన్న వివిధ వైద్య విభాగాల చికిత్సలు, సదుపాయాలు, వాటిని పొందే విధానాలపై ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు.
EHS కార్డు ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు తప్పనిసరిగా తమ EHS కార్డుతో పాటు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల రికార్డులను వెంట తీసుకురావాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది.
కావున మిర్యాలగూడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రివర్ హాస్పిటల్స్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
*శిబిరం వివరాలు:*
తేదీ: 22 నవంబర్ 2026, ఆదివారం
సమయం: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
వేదిక: రివర్ హాస్పిటల్స్, డాక్టర్స్ కాలనీ, మిర్యాలగూడ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.