📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై వ్యక్తి మృతి

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై వ్యక్తి మృతి

పెద్దవంగర, నవంబర్ 21 ప్రజావాణి .మండల కేంద్రంలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కొండ్ర జైపాల్ (35) గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. సుమారు 15 సంవత్సరాల క్రితం విజయవాడకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం కాగా, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాల్లో వివాదాలు కొనసాగుతున్నాయని, ఇటీవల భార్య తన పుట్టింటికి వెళ్లడంతో జైపాల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో జైపాల్ మృతి చెందినట్లు గుర్తించారు.
మృతుడి తల్లి కొండ్ర ధనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దవంగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుమారుడి మృతిపై ఎవరి మీదా అనుమానం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.