📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ఘనంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలు
దండేపల్లి, నవంబర్ 21 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలను ఆకుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం కొక్కిరాల సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజల మన్ననలు పొందాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా ఆకుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకురాలిగా కొక్కిరాల సురేఖమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.