ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేత
బెజ్జంకి, నవంబర్ 22 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి సబ్స్టేషన్ పరిధిలో 33 కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనుల కారణంగా రేపు (సోమవారం) రేగులపల్లి, చీలాపూర్, పోతారం గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ మహేష్ తెలిపారు. సంబంధిత గ్రామాల విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

