ఘనంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలు దండేపల్లి, నవంబర్ 21 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలను ఆకుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కొక్కిరాల సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి...