ఉపాధి హామీ పనుల్లో విషాదం…..
గుండెపోటుతో మహిళ మృతి…!
మృతురాలి కుటుంబానికి అండగా…..
మాజీ వైస్ ఎంపీపీ. దొంతుమంగేశ్వరరావు…!
మన ప్రజావాణి ప్రతినిధి!!నవంబర్ 21…! ఎటపాక మండలం!
ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన. పిడియాల వెంకట నర్సు (55) శనివారం ఉదయం. ఉపాధి హామీ పనులకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు…
ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు..
విషయం తెలుసుకున్న ఎటపాక మాజీ వైస్ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు. దొంతుమంగేశ్వరరావు.. గన్నవరం లోని మృతురాలి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక కా యానికి. నివాళులర్పించారు. వెంకట నర్స్. మృతిఅత్యంత బాధాకరమని. కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి ₹2,000 ఆర్థిక సాయం చేశారు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు. పాల్గొన్నారు

