📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచివరి తడి కోసం సీతారామ జలాలు విడుదల

చివరి తడి కోసం సీతారామ జలాలు విడుదల

📰 Generate e-Paper Clip

చివరి తడి కోసం సీతారామ జలాలు విడుదల

ఆదివారం నాటికి మేజర్ కాలువలకు చేరుకోనున్న సాగునీరు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

పంటలు ఎండిపోకుండా చివరి తడి అందించి ఆదుకోవాలంటూ రైతులు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నాయని, చివరి తడి అందకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి అవసరాన్ని వివరించి, వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. రైతుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన మంత్రి తుమ్మల అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
దీంతో వైరా–ఏన్కూరు, అన్నపురెడ్డిపల్లి, రామచంద్రపురం మేజర్ కాలువలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు. విడుదల చేసిన నీరు ఆదివారం నాటికి మేజర్ కాలువలకు చేరుకోనుంది. తద్వారా ఆయా కాలువల పరిధిలోని పంటలకు చివరి తడి అందే అవకాశం ఏర్పడింది.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విడుదల చేసిన గోదావరి జలాలను కేవలం పంటల సాగు అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. నీటిని వృథా చేయకుండా పొలాలకు అందేలా రైతులు సహకరించాలని కోరారు. చివరి తడి అందించడం ద్వారా పంటలను కాపాడి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
రైతుల విజ్ఞప్తికి వెంటనే స్పందించి సాగునీరు విడుదల చేయించిన మంత్రి తుమ్మల నిర్ణయంపై ఆయా ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.