📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణయువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం

📰 Generate e-Paper Clip

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం

44 కంపెనీల భాగస్వామ్యంతో ట్రినిటీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

విద్యతోనే వ్యక్తిగత, సామాజిక, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యం – మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి:నవంబర్ 21

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 44 ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపారు.

ఈ కార్యక్రమానికి ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.ఎస్. సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో 44 కంపెనీల భాగస్వామ్యంతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐటీ, నాన్ ఐటీ, ఫైనాన్స్ తదితర వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు.

విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజ పురోగతికి, ప్రాంత అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్యతో పాటు ఆధునిక కాలానికి అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను యువత పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు సాధించాలంటే పట్టుదల, కృషి, నైపుణ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువతకు అందుబాటులోకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు సాధించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందడమే కాకుండా తమ కుటుంబాలకు, సమాజానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ట్రినిటీ విద్యాసంస్థలు విద్యాబోధనతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని దాసరి మనోహర్ రెడ్డి వెల్లడించారు.

44 కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళా స్థానిక నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.