📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ..

కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ..

📰 Generate e-Paper Clip

కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం …
మహా భాగ్యం…

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
నవంబర్ 21.

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం లోని
కొండగట్టు అంజన్నను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్న ఆలయంతో పాటు బేతాళ స్వామి ఆలయంలోనూ పూజలు చేశారు. అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో 60 ఏళ్ల తర్వాత అర్చకులు, అధికారుల సూచనలు, నిబంధనల ప్రకారం భక్తులకు శాస్త్రీయ పద్ధతిలో నిజరూప దర్శనం కల్పిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కొండగట్టు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కరువు కాటకాలు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరాలని కోరుకున్నానన్నారు. 60 ఏళ్ల తర్వాత స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భక్తులందరూ ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.