📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమునుగోడులో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నాయకుల ప్రెస్ మీట్

మునుగోడులో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నాయకుల ప్రెస్ మీట్

📰 Generate e-Paper Clip

*మునుగోడులో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నాయకుల ప్రెస్ మీట్*

*పున్న కైలాష్ వ్యాఖ్యలపై తీవ్ర ఖండన – రాజగోపాల్ రెడ్డి వెంటే మేమంతా*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్యప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పున్న కైలాష్ చేసిన వ్యాఖ్యలను నాయకులు తీవ్రంగా ఖండించారు.

*బీమనపల్లి సైదులు, మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు* మాట్లాడుతూ – రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూడడమే మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆలోచన, ఆశయమన్నారు. అందులో భాగంగానే భువనగిరి లోక్ సభ స్థానం నుండి సొంత డబ్బులు ఖర్చు చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కి పంపించారన్నారు. బీజేపీ వాళ్లకు పదవులు ఇస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నావ్… నేను బీజేపీకి వెళ్లలేదు అయినా నాకు రెండు సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారన్నారు. కబర్దార్ పున్న కైలాష్, నిజాలు తెలుసుకోకుండా మరోసారి రాజగోపాల్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే ఊరుకోమని హెచ్చరించారు.

*బోయ దేవేందర్, చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు* మాట్లాడుతూ – తెలంగాణ ఉద్యమకారుడివని ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నావ్, కోమటిరెడ్డి బ్రదర్స్ ని తిడితే నాయకుడివి అవ్వాలని చూస్తున్నావ్ అన్నారు. నిప్పులాంటి మనిషి, నికార్సైన నాయకుడు, ఎటువంటి అవినీతి మచ్చ లేని నాయకుణ్ణి తిడితే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారా నీకు అని ప్రశ్నించారు. 10 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీని ఎదిరించడంలో రాజగోపాల్ రెడ్డి ముందున్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావన్నారు. ముఖ్యమంత్రి కి విన్నవిస్తున్నాం.. అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడగడం కూడా పార్టీ వ్యతిరేక చర్యనేనా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎంపీని గెలిపించమని ఇంటికొచ్చి చెప్పి, మంత్రి పదవి దేవుడెరుగు కనీసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలన్నారు.

*రాందాస్ శ్రీనివాస్, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు* మాట్లాడుతూ – బీజేపీ వాళ్లకు పదవులు ఇచ్చాడని పున్న కైలాష్ అంటున్నాడు. చండూరు, చౌటుప్పల్, మునుగోడు మండల అధ్యక్షులు నాడు బీజేపీకి రాకపోయినా పనిచేసే వాళ్లకే పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్లకు మళ్ళీ పదవులు కట్టబెట్టాడన్నారు. ఒక బీసీ బిడ్డగా చెబుతున్నా, రాజగోపాల్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

*బుజ్జి, మాజీ జడ్పిటిసి నారాయణపూర్* మాట్లాడుతూ – రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం నుండి నిధులు రాకున్నా తన సొంత నిధులతో చేతనైన కాడికి పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఆయన అభివృద్ధి కోసమే నిధులు ఇవ్వమని అడుగుతున్నాడు కానీ తన సొంతం కోసం కాదని గుర్తించాలన్నారు.

*మిర్యాల వెంకన్న, మునుగోడు మాజీ సర్పంచ్* మాట్లాడుతూ – పున్న కైలాష్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా ఎదిగాడో దానికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. నేను చేనేత బిడ్డగా చెప్తున్నాను, పున్న కైలాష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి మీరు కండ్లు తెరవండి, మునుగోడు వెనకబడి ఉంది, మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు కాబట్టి మా ఎమ్మెల్యే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు.

*పూల వెంకటయ్య, మాజీ ఎంపీపీ, నాంపల్లి* మాట్లాడుతూ – 2015లో టీఆర్ఎస్ గాలికి ఎదురొడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచాడన్నారు. మాట ఇచ్చి మోసం చేస్తే ప్రశ్నించొద్దా అని నిలదీశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అహర్నిశలు పనిచేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి, మా రాజగోపాల్ రెడ్డి వెంట మేమందరం కలిసి నడుస్తామన్నారు.

*పల్లె వెంకన్న గౌడ్, చండూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు* మాట్లాడుతూ – రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాటి ఇంచార్జ్ సునీల్ కనుగోలు పార్టీలోకి తీసుకొచ్చారన్నారు.

*వెన్నంనేని రవీందర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాంపల్లి* మాట్లాడుతూ – మునుగోడు ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడాడన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్త ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.