📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచండూరు మండలంలో 64 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

చండూరు మండలంలో 64 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

*చండూరు మండలంలో 64 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*

*రూ.19,89,500 విలువైన చెక్కులు అందజేత*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

చండూరు మండలంలోని 19 గ్రామాలలో అనారోగ్య కారణంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 19 గ్రామాలకు సంబంధించిన 64 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 64 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19,89,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలవడమే లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి బాధిత కుటుంబానికి సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారికి సహాయం అందించేందుకు పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కోరిమి ఓంకారం, జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, కాసాల జనార్దన్ రెడ్డి, సాపిడి రాములు, ఇరిగి రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుతరాజు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గంట తులసయ్య, మండల కాంగ్రెస్ కార్యదర్శులు ఇరిగి నరసింహ, వేమయ్య, వెంకన్న, చొప్పరి రాజు, తీగల శేఖర్, పెద్ద బిక్షమయ్య, కట్టకొల రామేశ్వరరావు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోము లింగస్వామి, చొప్పరి వారి గూడెం సర్పంచ్ జాల వెంకన్న, మాజీ సర్పంచ్ చొప్పరి వెంకన్న, స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.