ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్ కళావతి జగదీష్
డోర్నకల్, నవంబర్ 21 (మన సమగ్ర ప్రజావాణి):
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డీఎస్ కళావతి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి డోర్నకల్ మండల స్పెషల్ ఆఫీసర్, డీఏఓ విజయచంద్ర, ఎంపీడీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరై ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు అందించేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

